calender_icon.png 27 October, 2024 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు!

30-08-2024 01:23:21 AM

  1. నిబంధనలకు పట్టించుకోలేదని ఆరోపణలు  
  2. టీచర్ల అవసరాలకు అనుగుణంగా సర్దుబాట్లు?
  3. జిల్లా విద్యాశాఖాధికారిపై అవినీతి ఆరోపణలు 

ఖమ్మం, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా విద్యాశాఖలో అవినీతి కంపు కొడుతోంది. విద్యాశాఖలో అవినీతి వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాం శమైంది. డిప్యుటేషన్ల వ్యవహారంలో జిల్లా విద్యాశాఖాధికారిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కాసులకు కక్కుర్తిపడి, నిబంధనలకు తిలోదకాలిచ్చారని చర్చి ంచుకుంటున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, మంత్రుల ఫైరవీల నేపథ్యంలోనే అక్రమ డిప్యుటేషన్లు జరిగినట్టు బహిరంగంగానే ఆరోపణ వినిపిస్తున్నాయి.

విద్యార్థుల అవసరాల కోసం చే యాల్సిన డిప్యుటేషన్లను ఉపాధ్యాయుల అవసరాల కోసం చేశారని చెప్పుకొంటున్నారు. ఖమ్మం జిల్లాలో అన్నిరకాల ప్రభుత్వ విద్యా సంస్థలు 1200 దాకా ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరు. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు ఉన్నా పిల్ల లు లేని పరిస్ధితి ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలోని సుదూర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వీర ంతా తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందు కు డిప్యుటేషన్‌ను ఎంచుకుంటారు. ఇదే వి ద్యాశాఖాధికారులకు అవకాశంగా మారింది. 

కాసులిస్తే పని సులువే

చెప్పినన్ని కాసులు ఇస్తే చాలు ఎవరైనా కోరుకున్న ప్రాంతానికి ఇట్టే డిప్యుటేషన్‌పై వెళ్లడం ఖాయమన్నట్టు పరిస్థితి మారింది. జిల్లా విద్యాశాఖాధికారులు నిబంధనలను పక్కకు బెట్టి, డిప్యుటేషన్లు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముదిగొండ మండలం బాణాపురం పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని ఖమ్మం నగరానికి డిప్యుటేషన్ చేశారు. అలాగే సత్తుపల్లి మండలం గంగారంలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని ఖమ్మం పక్కనే ఉన్న కూసుమంచికి, చింతకాని మండలం పొద్దుటూరులో ఉన్న ఓ టీచర్‌ను ఖమ్మంలోని జలగంనగర్‌కు, వైరా హైస్కూల్‌లో పని చేస్తున్న మరో టీచర్‌ను ఖమ్మంలోని రోటరీనగర్‌కు, వైరా బాలికల హైస్కూల్ నుంచి ఉపాధ్యాయురాలిని ఖమ్మంకు నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ ఇచ్చారు.

వైరా బాలికల హైస్కూల్‌లో పని చేస్తున్న ఉపాధ్యాయురాలిని గత రెండేళ్లుగా డిప్యూటేషన్ పై ఆమె కోరుకున్న ప్రాంతానికి పంపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆమెను రెండుసార్లు ఖమ్మం జిల్లాకేంద్రంలోని స్కూలుకు డిప్యుటేషన్ ఇవ్వడం గమనార్హం. వైరాలో ఉన్నప్పుడూ ఖమ్మంలోనే డిప్యూటేషన్ వేయించుకున్నారని, ప్రస్తుతం బోనకల్ బదిలీ అయినా అక్కడి నుంచి ఖమ్మంకు డిప్యుటేషన్ చేయించుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటలో పని చేస్తున్న ఒక టీచర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో హెల్పర్‌గా నియమించుకోవడం గమనార్హం. 

ఆయా మండలాల పరిధిలోనే డిప్యూటేషన్

వాస్తవానికి టీచర్లు కొరతగా ఉన్న పాఠశాలలకు మాత్రమే ఆయా మండలాల పరిధిలోనే డిప్యుటేషన్ చేయాలి. కానీ, టౌన్‌లో పని చేస్తూనే మళ్లీ టౌన్‌లోనే డిప్యూటేషన్ ఇవ్వడమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి డిప్యుటేషన్లకు సంబంధించి పైనుంచి ఎటువంటి ఉత్తర్వులు, జీవోలు లేవు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా మండలాల్లో డిప్యుటేషన్ చేయాలి. కానీ, అవేవి పట్టకుండా ఇష్టానుసారం డిప్యూటేషన్లు ఇచ్చి, చేతులు దులుపుకున్నారు. ఇటీవల జరిగిన డిప్యూటేషన్లలో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అనర్హుల డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. కాగా, దీనిపై వివరణ కోరేందుకు జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌లో సంప్రదించగా, ఆయన స్పందించలేదు.