- తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం
ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామంటున్న పట్టణవాసులు
చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్, జనవరి 2 (విజయ క్రాంతి): నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించు కోండి.. దర్జాగా తమ సొంత ఇంట్లో జీవిం చండి అంటూ నిత్యం అధికారులు ప్రజాప్ర తినిధులు చెబుతున్న వాస్తవమైన మాట. కాగా కొందరు తక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుంటామని అనుమతులు పొంది వారి ఇష్టానుసారంగా అత్యధిక స్థలంలో ఇ ల్లు నిర్మాణ పనులు చేపడుతుండ్రు.
తప్పు అని తెలిసిన అటువైపు చూడకుండా ప్రభు త్వానికి చెల్లించే పన్నులను మినహాయించు కునేందుకు ఒక్కొక్కరు ప్రత్యేక ప్లాన్ల ను వారి ఇంటి నిర్మాణాలపై అమలు చేస్తుండ్రు.
తెలిసి తెలియనట్టు..
మున్సిపల్ అధికారులకు పట్టణ పురపా లికపై పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతుండ్రు? ఎవరు సెట్ బ్యాక్ తీసుకోవడం లేదు? తక్కువగా అనుమతులు తీసుకొని అత్యధిక స్థలంలో నిర్మిస్తుండ్రు? అనే విషయాలు పురపాలక సంబంధిత అధికారులకు స్పష్టంగా తెలుసు. ఈ విషయంపై అధికారులు ఎందుకు మౌనం ఉన్నారో తెలియదు గానీ పట్టణం లో మాత్రం అక్రమ నిర్మాణంలో ఇదేచ్ఛ యంగా జరుగుతున్నాయి.
జిల్లా కలెక్టర్ సైతం పట్టణంలో పలువురు అక్రమ నిర్మా ణాలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడం జరి గింది. కాగా మున్సిపల్ అధికారులు నామ మాత్రంగా వచ్చి కేవలం పరిశీలన చేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెనతిరు గుతుందని ఆరోపణలు పొందుకుంటు న్నాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వా రా మున్సిపల్ ఆదాయానికి గండి పడ టంతో పాటు వర్షాకాలంలో నీరు మురుగు కాలువల నుండి పోకుండా రోడ్లపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీంతో గతంలోనే పలుమార్లు ఇండ్లలోకి వర్షపు నీరు మురుగునీరు చేరిన విషయం విజి తమే. ఆ సమయంలో నిబంధనలు అమలు చేస్తాం, అందరూ సెట్ బ్యాక్ తీసుకోవాలి అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేసి ఆ తర్వాత మౌనంగా ఉండడంతో అక్రమ నిర్మాల జోరు మరింత ఊబ అందుకుం టుంది.
పరిశీలన చేసిన ఫలితం శూన్యం
నిబంధనల విరుద్ధంగా నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణంలో అధికారులు పరిశీలన చేసిన ఫలితం మాత్రం శూన్యం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని న్యూ టౌన్, శ్రీనివాస్ కాలనీ, పాలకొండ, అరబ్ గల్లి తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిండ్రు.
ప్రజలకు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణాన్ని అందించేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్మాణాలు చేపట్టిన తర్వాత నిర్వీర్యం చేస్తే ఇంటి యజమానులకు ఎంతో ఇబ్బందిక రంగా ఉంటుందని, ముందుగానే అధికారు లు నిబంధనలను పక్కాగా అమలు చేయిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఎమ్మెల్యేకు విన్నవించేందుకు సన్నధం
మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి ఓ ప్రత్యేకత ఉంది. ఉమ్మడి జిల్లాలోనే ఈ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ నుంచి కార్పొరేషన్ గా ఎదిగిన ఘనత సొంతం చేసుకుంది. మునుముందు మహబూబ్‌నగర్ మున్సిపా లిటీలో కార్పొరేషన్ ఎన్నికలకు సన్నతమవు తుంది. అక్రమ నిర్మాణాలు ఆపితే ఈ పట్టణానికి మరింత శోభ వస్తుందని పట్టణ పుర ప్రముఖులు పలువురు ఆశపడు తుండ్రు.
కని విని ఎరుగని స్థాయిలో అభి వృద్ధి చేస్తామని ఇప్పటికే ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ స్థాయిని మరింత రెట్టిం పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికీ అక్రమ నిర్మాణాలు, నో సెట్ బ్యాక్ లేకుండా చేపడుతున్న ఇండ్ల నిర్మాణంలో పట్టణంలోని పలువురు ఫిర్యాదు చేసేందు కు సన్నధమవుతుండ్రు.
అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు
ప్రజలు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు నిబంధనలను పూర్తిస్థాయిలో పొందిపరిచి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. నిబంధనకు లోబడి ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే ఇంటి టాక్స్ చెల్లించవలసి ఉంటుంది.
ఇతను సారంగా నిర్మాణం చేపడితే టాక్సీ కూడా అత్యధికంగా జీవితకాలం చెల్లించవలసి ఉంటుంది. ఒకసారి గమనించి నిబంధనకు లోబడి సెట్ బ్యాక్ తో పాటు ఎంత వరకు అయితే అనుమతులు పొందుతారు అంతవరకు మాత్రమే నిర్మణాలు చేపట్టాలి. మున్సిపల్టికి పూర్తిస్థాయిలో పట్టణ వసతులు సహకరించాలి. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
-- మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్