calender_icon.png 26 December, 2024 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి

07-11-2024 04:57:30 PM

సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోరా?

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని పదవ డివిజన్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అడ్డుకట్ట వేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు  ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో రాజు మాట్లాడుతూ.. కరీంనగర్ నగర పరిధిలోని పదవ డివిజన్లో భూమి బకెట్ హాల్ పక్కన హనుమాన్ నగర్ లో స్వశక్తి కాలేజీ నుండి కోతి రాంపూర్ వెళ్లే బైపాస్ రహదారిపై బహుళ అంతస్తుల భవనం పూర్తిగా ప్రభుత్వాన్నిబంధన లు తుంగలో తొక్కిందని రోడ్డుకు ఐదు ఫీట్లు వెనుకకు జరిగి కట్టాల్సిన భవనం రోడ్డు ముందటికి 10 ఫీట్లు వచ్చి భవనం నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ యొక్క భవనం అక్రమ నిర్మాణంపై గతంలో పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని గతంలో అక్రమ నిర్మాణంపై అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప చేసిందేమీ లేదని పేర్కొన్నారు. నిస్సిగ్గుగా ప్రధాన రహదారిపైనే ఇంత అక్రమ నిర్మాణం జరుగుతుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నట్లు అని ఆయన ప్రశ్నించారు.

రోడ్డుపై చిన్న భవనాన్ని రెండు ఫీట్లు ముందుకు వచ్చి నిర్మిస్తే హుటా హుటిన అధికారులు వచ్చి కూలగొట్టిన సంఘటనలు కరీంనగర్ లో కోకొల్లలుగా ఉన్నాయని కానీ నడిరోడ్డుపై అక్రమన చేస్తే మాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారుల పని ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవాలన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్, అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలు పాటించని రోడ్డుపై నిర్మాణాలు చేస్తున్న పదవ డివిజన్  భవనాలపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజా ఆందోళన తప్పదని పైడిపల్లి రాజు  అధికారులను హెచ్చరించారు.