అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 21: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల్లో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం సీజ్ చేశారు. ఎలాంటి అనుతులు లేకుండా నిర్మాణాలు చేపడుతన్నట్లు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు రావడంతో...ఆయన ఆదేశాలకు మేరకు శనివారం టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణాలను సీజ్ చేశారు. కమిషనర్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. పెద్ద అంబర్‌పేట్‌లోని సర్వే నెంబర్ 230, 231లో సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్ రావు అనే వ్యక్తులు గోడౌన్ నిర్మించారు. అదే విధంగా కుంట్లూరులో సర్వే నెంబర్ 240లో బద్దం జనార్ధన్‌రెడ్డి, గౌరెల్లి లోని సర్వే నెంబర్ 191లో పూరం స్వర్ణలత ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడంతో ఆ నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. పెద్ద అంబర్‌పేట్ సర్వే నెంబర్ 177, 178, 179లలో కంపౌండ్ గోడను కూల్చేశారు.