calender_icon.png 5 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనగిరి మున్సిపాలిటీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

04-04-2025 01:34:59 AM

  1. చోద్యం చూస్తున్న అధికారులు. 
  2. ప్రభుత్వ ఆస్తులకు నంబర్లు 
  3. ప్రవేట్ డాక్యుమెంటార్లతో సబ్ రిజిస్టార్లు కుమ్మక్కు

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 3 (విజయక్రాంతి): యాదా ద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎదోచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోక  నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచాలు ఇచ్చుకో లక్షణం గా అక్రమ నిర్మాణాలు చేసుకో అనే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల విలు వచేసే ప్రభుత్వ విద్యాసంస్థల భూములను పరిరక్షించడంలో సంబంధిత అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించి కబ్జాదారుల చేతిలో పెడుతున్నారు. 

జిల్లా కేంద్రంగా విరాజిల్లుతూ దిన దినాభివృద్ధి చెందుతున్న భువనగిరి మున్సిపాలిటీలో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న  పట్టించుకునే నాధుడే లేడు. ఆస్తి పన్ను వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా కేటాయిస్తున్న ఇంటి నెంబర్లతో అవినీతి సబ్ రిజిస్ట్రాళ్లు, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై మున్సిపల్ ఇచ్చిన నెంబర్లు గల ఆస్తులను రిజిస్టర్ చేస్తూ లక్ష రూపాయలు గుంజుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై బాధితులు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లుగా వివరిస్తున్నా రు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన జాతీయ రహదారికి పక్కన ప్రైవేట్ డాక్యుమెంటల్ రైటర్ పనిచేసి కోట్లు గడించిన అతను మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ  బహుళ అంతస్తులు భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాణంపై ఫిర్యాదుల అందిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 

జిల్లా కేంద్రంలో విద్యాలయాల నిర్మాణం కోసం అప్పటి నైజాం ప్రభుత్వం పట్టణం నడిబొడ్డున స్థలాన్ని కేటాయించిం ది. 1970లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల భవనం మంజూర అయింది. తదనంతరం ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ డాక్టర్ ఎన్నారై తన మాతృమూర్తి జ్ఞాపకార్థం సి ఎన్ ఎన్ ఆర్ జూనియర్ కళాశాల మూడంతస్తుల భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అందజేశారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యజిస్తున్న విద్యార్థిని విద్యార్థులతో పాటు జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం, క్రీడలపై అప్ప టి ప్రభుత్వాలు భువనగిరి పరిధిలోని హుస్సేనాబాద్ రెవిన్యూ పరిధిలో సర్వేనెంబర్ 138 లో నాలుగు ఎకరాల 16 గుంటలు. సర్వేనెంబర్ 1051లో 37 గుంటలు. సర్వేనెంబర్ 10 52 లో రెండు ఎకరాల 34 గుంటలు. సర్వేనెంబర్ 10 53 లో రెండు ఎకరాల 25 గుంటలు. 10 54 సర్వే నెంబర్లు ఒక ఎకరం 14 గుంటలు.

భూములను కొనుగోలు చేసింది. కళాశాలకు పక్కనే 138 సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల 16 గుంటల జూనియర్ కళాశాలకు వదిలేశారు.కళాశాలకు చెందిన భూమిపై కన్నేసిన భూకబ్జాదారులు అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఇంటర్నెట్ బోర్డ్ అధికారులు హైకోర్టులో కేసు వేశారు. కళాశాలకు చెందిన మొత్తం 12 ఎకరాల ఆరు గుంటల భూమి  కాపాడాల ని తెలంగాణ హైకోర్టులో వేసిన కేసు నడుస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు.

హైదరాబాదు వరంగల్ జాతీయ రహదారి కి ఎడమ వైపున ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన గల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు.సర్వే నెంబర్ 138 లోని  భూములపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. 1962లో హైదరాబాద్ చెందిన సయ్యద్ అహ్మద్ హుస్సేన్ కు సంబంధించిన 743 చదరపు గజాల ఇంటిని భువనగిరి మండలం అనంతరం గ్రామానికి చెందిన వారు కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఫేక్ డాక్యుమెంట్లని స్పష్టమవుతుంది.

ఇల్లు కొనుగోలు చేసిన యజమాని లింక్ డాక్యుమెంట్ లేక బినామీ ఆస్తిని భువనగిరి పట్టణానికి చెందిన 8 మంది పేరుమీద 199.67 చదరపు గజాల భూమి గల గృహాలను అమ్మినట్లు డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్టర్ ఆఫీస్ అధికారులు డాక్యుమెంట్ రైటర్లు కుమ్మక్కై బినామీ ఆస్తులను చట్టబద్ధం చేసుకున్నారు. ఈ స్థలంలో బౌల అంతస్తుల నిర్మాణం జరుగుతుంది.

జాతీయ రహదారి పక్కనే నిర్మించే ఈ భవనం టౌన్ ప్లానింగ్ చట్టప్రకారం 60 ఫీట్ల రోడ్డు అవుతల మూడు మీటర్ల స్థలాన్ని, గ్రీన్ ఫీల్ కోసం ఐదు ఫీట్ల స్థలాన్ని వదిలి నిర్మించుకోవాలి. నిర్మాణానికి కలిగి ఉన్న 20 ఫీట్ల రోడ్డుకు రెండు మీటర్ల స్థలంతో పాటు మూడు ఫీట్ల గ్రీన్ ఫీల్ స్థలాన్ని వదిలి నిర్మాణం చేపట్టాలి. అని మున్సిపల్ నిబంధనలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులకు ముడుపుల అప్పజెప్పి అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. 

ఈ నిర్మాణాలపై ప్రశ్నిస్తే వారికి అన్ని పర్మిషన్లు ఉన్నాయం టూ అధికారులు దాటవేస్తున్నారు. జి ప్లస్ త్రీ బౌల అంతస్తుల భవన నిర్మాణం కోసం అనుమతుల మంజూరు పట్టణానికి ఉందా లేదా అనే విషయంపై కూడా మున్సిపల్ అధికారులకు అవగాహన లేదు. బౌల అంతస్తుల నిర్మాణాలు పట్టణంలో ప్రధాన రోడ్లపై జరుగుతున్నాయి.

నిర్మాణాలు చేపడుతున్న వారంతా అధికార పార్టీ బలం, అధికారుల బలం, డబ్బు బలంతో నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టానుసారంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పట్టణ ప్రధాన రోడ్డు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్రమ నిర్మాణాల ను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు