29-03-2025 12:11:24 AM
రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారుల సంయుక్త సర్వే
పటాన్ చెరు, మార్చి 28 :తెల్లాపూర్ మున్సిపాలిటీ సర్వేనంబర్ 324లోని నారాయణరావు వెంచర్ కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే చేపట్టారు.
గతంలో నారాయణరావు వెంచర్ లోని ఏ బ్లాక్ లో హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉన్న స్థలంలో ఉన్న ఫెన్సింగ్ ను ధ్వంసం చేసి లేని రోడ్డును చూపించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని మంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో విచారణ జరుపాలని మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు రామచంద్రాపురం మండల రెవెన్యూ అధికారులు హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు.