పటాన్చెరు,(విజయక్రాంతి): ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారు. సోమవారం పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా పెద్దపెద్ద భవనాలు నిర్మాణం చేయడంతో వాటిపై ప్రజలు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు విచారణ చేసి అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను నివారించవలసిన అధికారులు వారికి ప్రోత్సహించారని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామపంచాయతీ ఈవో అవినీతి అక్రమాలతోని అక్రమ నిర్మాణాలు జరిగాయని ని ప్రజలు ఆరోపిస్తున్నారు.