calender_icon.png 23 March, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలస గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు : ఆదివాసీ సంక్షేమ పరిషత్

22-03-2025 10:24:39 PM

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల శాఖ ఆధ్వర్యంలో చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలో 1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతర్లు నిర్మిస్తున్న అక్రమ ఇండ్ల నిర్మాణాలకు గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేవా అని ఆర్తీ ఐ యాక్ట్ ద్వారా చల్లసముద్రం  పంచాయతీ కార్యదర్శిని కోరారు. ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇల్లందు  మండల అధ్యక్షులు చింత ఉపేందర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 1970 సంవత్సరం తర్వాత వలస వచ్చిన గిరిజనేతరులు అక్రమ ఇళ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసి ఈ ఏజెన్సీ ప్రాంతంలోని మా చట్టాలను నిర్వీయం చేయడమే కాకుండా మా జీవోలను మాకు అమలు కాకుండా కోర్టులను ఆశ్రయించి ఆదివాసుల మనుగడ లేకుండా చేస్తున్న

ఈ వలస గిరిజనేతలకు ఏజెన్సీ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు అనుమతులు ఇస్తున్న గ్రామపంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2011 లోనే వన్ 1/70 చట్టానికి విరుద్ధంగా  గిరిజనేతర్లకు కరెంటు మీటర్లు ఇవ్వొద్దని తహసిల్దార్లకు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం మెమో ఇచ్చిన కూడా  ఆ మెమో అమలు చేయడంలో గిరిజనేసర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర కిషోర్, కార్యదర్శి ఈసాల  రామచంద్ర, రాకేష్  పాల్గొన్నారు.