calender_icon.png 18 October, 2024 | 9:51 AM

అక్రమ కేసులు పెడుతున్నారు

18-10-2024 01:56:48 AM

డీపీజీకి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫిర్యాదు

మహబూబ్‌నగర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): అధికార పార్టీనేతల ప్రోద్భలంతో జిల్లాపరిధిలోని బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఇది సరియైన విధానం కాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదన్‌చారి, ఎమ్మెల్యే నవీన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

గురువారం వారు రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్న కార్యకర్తలపై అకరాణంగా అక్రమ కేసులు పెడుతున్నారని.. ఇలాంటివి పునారవృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు. వారివెంట సర్పంచ్‌ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదగిరి తదితరులు ఉన్నారు. 

కలెక్టర్, సీపీని కలిసిన గంగుల

కరీంనగర్, అక్టోబరు 17 (విజయక్రాంతి): అధికార పార్టీ నేతలు బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగు ల కమలాకర్ ఆరోపించారు. ఇటీవల గణేశ్ నిమజ్జనం సందర్భంగా బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు మరికొందరిపై నమోదైన కేసుల విషయాన్ని గురు వారం కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని కలిసి వివరిం చారు. గంగుల మాట్లాడుతూ.. ఆయా కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీపీని కోరామన్నారు. అధికార పార్టీ నేతలు అభివృద్ధిపై దృష్టి సారించాలని గంగుల కమలాకర్ హితవు పలికారు.