04-03-2025 11:40:59 PM
చేర్యాల (విజయక్రాంతి): జర్నలిస్టులపై కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించడం మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి సూచించారు. చేర్యాల పట్టణంలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తన అధికార బలంతో అనుచరులతో అకారణంగా కేసులు పెట్టిస్తున్నారన్నారు. ప్రశ్నించే గలాలపై కేసులు పెట్టించడం తగదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ప్రజాస్వామ్యన్ని కాపాడడానికి ప్రజాసామికవాదులు, మేధావులు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంటనే జర్నలిస్టుకు క్షమాపణ చెప్పి, కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్ మావో, బండ కింది అరుణ్ కుమార్, దాసరి ప్రశాంత్ తదితరులు ఉన్నారు.