జిల్లా ఎస్పీకి అంబేద్కర్ సంఘాల ఐఖ్య పోరాట సమితి వినతి...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఈనెల 21న దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితున్ని కఠినంగా శిక్షించాలనీ అంబేద్కర్ సంఘాల ఐఖ్య పోరాట సమితి సభ్యులు మంగళవారం ఎస్పీ గౌష్ అలం ను కలిశారు. అదే ఘటనలో పోలీసులపై రాళ్లు రువ్వి గాయపర్చిన సందర్భంగా పలువురు అమాయకులను అరెస్టు చేసి జైలుకు పంపించటం జరిగిందని, అమాయకులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఎస్పీని కోరారు. దాదాపు 21 మంది మీద కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఈ విషయంలో సమితి సభ్యులు గుడిహత్నూర్ లో ప్రత్యక్షంగా సందర్శించి నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవటం జరిగిందని ఎస్పీకి వివరించారు. ఈ ఘటనకు ఏమాత్రం ప్రమేయంలేని వారిని శిక్ష నుండి తప్పించమని కోరామన్నారు. ఈ విషయంలో ఎస్పీ సానుకూలంగా స్పందించరని సమితి సభ్యులు పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అల్లారి భూమన్న, నాయకులు నల్లంటి నవీన్, నగేష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.