calender_icon.png 24 January, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ బెల్ట్ షాపులను నియంత్రించాలి...

24-01-2025 04:40:26 PM

బినామీ పేర్లతో మద్యం షాపులను నడుపుతూ మద్యం సిండికేట్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి...

జాతీయ వినియోగదారులు, మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్డీవోకి వినతి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (విజయక్రాంతి): ఏజెన్సీలో జరుగుతున్న మద్యం దోపిడీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జాతీయ వినియోగదారులు, మానవ హక్కుల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు శుక్రవారం భద్రాచలం ఆర్డీవో కు వినయ్ పత్రం సమర్పించడం జరిగింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల భద్రాచలం, పినపాక నియోజకవర్గాలలో కొంతమంది వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి ఏజెన్సీ ప్రాంతం కావడంతో, గిరిజనుల పేరు మీద టెండర్లు వేసి గిరిజనేతర్లు మద్యం షాపులు నడుపుతున్నారు. అంతే కాకుండా భద్రాచలం, దుమ్ముగూడెం చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక మండలాలలో బినామీ పేర్ల మీద మద్యం షాపులు నడిపేవారు సిండికేట్ గా ఏర్పడి ప్రతి ఒక్క మండలాలలో మద్యం సిండికేట్ ఆఫీసు ఏర్పాటు చేసి సామాన్యులు తాగే కొన్ని బ్రాండ్ల మధ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ రేట్లకు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు.

ఇదే అదునుగా బెల్ట్ షాపులవారు ఇంకొంచెం ఎక్కువ రేటు వేసి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. ప్రతి మండలంలో నాలుగైదు సిండికేట్ మద్యం సిండికేట్ పాయింట్లు ఉంటాయి ప్రతినిత్యం బెల్ట్ షాపులకు బహిరంగంగా మద్యం సరఫరా చేస్తున్నాయి. ప్రతి మండలానికి 500 బెల్ట్ షాపులు తగ్గకుండా వాడవాడలో వీధి వీధిలో గుడి, బడి అని తేడా లేకుండా తెల్లవారుజాము నుంచి రాత్రి రెండు గంటల వరకు యదేచ్చగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల దేవాలయాలకు, స్కూలుకు వెళ్లాల్సిన పని పిల్లలు హాస్టల్ దగ్గర్లో బెల్ట్ షాపులు ఉండటం వల్ల మహిళలు విద్యార్థులు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బెల్ షాపులు నిర్వహించడమే కాకుండా మద్యం షాపుల కౌంటర్లలో ఉండే వ్యక్తులు ఒక కొత్త దోపిడీకి తెర లేపారు. ఫోన్ పే గూగుల్ పే ఉండవని ఒకవేళ ఫోన్ పే గూగుల్ పే చేస్తే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి పది నుంచి 20 రూపాయలు ఎక్కువ కొట్టాలని దోపిడీ మొదలుపెట్టారు. మద్యం పేరుతో నడిచే ఈ అక్రమ దోపిడీని అరికట్టాలని జాతీయ వినియోగదారులు మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చెట్టి జస్వంత్ ఆధ్వర్యంలో భద్రాచలం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్డీవోకి వినతి పత్రం అందజేశారు. ఆర్డీవో ఈ సందర్భంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.