calender_icon.png 3 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా, గ్రామ దీపికల అక్రమ అరెస్టులు హేయమైన చర్య

26-03-2025 12:59:58 AM

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బి నర్సారెడ్డి

భద్రాచలం, మార్చి 25 (విజయ క్రాంతి): ఆశ, గ్రామ దీపికలను అరెస్టు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి కి పాల్పడుతుందని, అక్రమ అరెస్టులకు పాదపడటం హే య్యమైన చర్యగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నర్సారెడ్డి మండిపడ్డారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సోమ మంగళవారాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేస్తున్న ఆశ గ్రామ దీపికలను అక్రమంగా అరెస్టు చేయటం  శోచనీయమన్నారు. అక్రమ అరెస్టులపై మంగళవారం  ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో తమ న్యాయమైన కోర్కెల కోసం ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ 18 వేలు ఇవ్వాలని ,వివోఏ లకు కూడా కనీసం రూ18 వేలు వేతనం ఇవ్వాలని చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారన్నారు. 

సంబంధిత అధికారుల వద్ద ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలను , గ్రామ దీపికలను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 36 రోజులు సమ్మె చేసిన సందర్భంలో, నేడు  అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షా శిబిరాల వద్దకు వచ్చి అనేక ఉకా దంపుడు ఉపన్యాసాలు చెప్పి మేము అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు రూ 18వేలు వేతనం ఇస్తామని అలాగే వివో ఏ లకు కూడా రూ18వేలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వ బాటలో నడిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు.  ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నర్సారెడ్డి హెచ్చరించారు