04-03-2025 12:03:14 PM
హైదరాబాద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు
అరెస్టులను ఖండించిన సిఐటియు ప్రతినిధులు
కామారెడ్డి,(విజయక్రాంతి): హైదరాబాద్ ప్రజావాణి(Prajavani)లో తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు,(Anganwadi workers) ఆయాలు తరలి వెళ్తున్న వారిని పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్టులు చేశారు. ఏ సెక్టార్ పరిధిలో ఉన్న వారిని అక్కడే అరెస్టు చేసి పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులను సిఐటియు నాయకులు ఖండించారు. అరెస్ట్ అయిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా(Kamareddy District)వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ప్రజావాణిలో ప్రజా దర్బార్ హైదరాబాదులోని ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికే బయలుదేరుతున్న మినీ అంగన్వాడీ లతోపాటు అంగన్వాడి టీచర్స్ లను ప్రభుత్వం పోలీసుల చేత అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని మినీ అంగన్వాడీలకు గత 11 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఏరియర్స్, వేతనాలను విడుదల చేయాలని, పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని ప్రజా దర్బార్ ప్రజావాణిలో వినతి పత్రాలు ఇవ్వడానికి బయల్దేరి వెళుతున్న మినీ టీచర్లతో పాటు అంగన్వాడీలను అక్రమంగా రాత్రి నుండే హౌస్ ఆరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్ లకు తరలించారని వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు(Anganwadi Union District President) సురేష్, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం రోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ నిర్బంధ పాలనకు తెరతీస్తోందన్నారు. ప్రజా పాలన అంటున్న ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలను అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిపోయి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం. నిర్బంధాన్ని ప్రయోగించడం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాదని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే భేషరతు గా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడి కార్యకర్తల జిల్లా నాయకులు అక్రమ అరెస్టులను ఖండించారు.