calender_icon.png 24 March, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులను ఆపాలి

22-03-2025 12:00:00 AM

జిల్లా అధ్యక్షుడు కొండ ఉప్పలయ్య

మహబూబాబాద్, మార్చి 21: (విజయక్రాంతి) : కార్మిక సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఆపాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షులు కొండ ఉప్పలయ్య అన్నారు. శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలో కార్మిక సంఘా ల నాయకులు దుండి వీరన్న, కొండ ఉప్పలయ్య,జినక సైదులును పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.

మార్చి 21న అసంఘటిత రంగ కార్మికుల మహాధర్నాకు హాజరు అయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరిన భవన ఇతర నిర్మాణ కార్మికులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు లను ఖండింస్తూ నిరసనగా తమ మండల కేంద్రములో రేపు ధర్నాలు నిరసనలలు తెలియ జేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని ఉప్పలయ్య తెలిపారు. 

కెవిపిఎస్ ఖండన

కార్మిక  హక్కులు సమస్యల కోసం చలో హైదరాబాద్ వెళుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని కులవ్యక్షత వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఖం డించింది. శుక్రవారం సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య నాయకులకు సం ఘీభావం ప్రకటించారు.

కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు వారికి చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు.సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కార్మిక సంఘాలు పోరాడుతాయని లచ్చయ్య స్పష్టం చేశారు.కార్మిక సంఘాలకు మద్దతుగా సామాజిక సంఘా లు అండగా ఉంటాయని తెలిపారు.