calender_icon.png 28 November, 2024 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులు దుర్మార్గం

28-11-2024 01:54:26 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పురుగులన్నం మాకొద్దు..

అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా? విద్యార్థులకు మంచి భోజ నం కూడా పెట్టలేని దీన స్థితిలో ఈ ప్రభు త్వం ఉందా? అని బుధవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మాని.. ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.