calender_icon.png 12 March, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు ప్రచారాలతో అక్రమంగా అడ్మిషన్లు

11-03-2025 01:15:02 AM

  • డబ్బులు వసూలు చేస్తున్న ప్రెసిడెన్సి విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలి

నిజామాబాద్ జిల్లా కార్యదర్శులు ఓమయ్య, రఘురాం

నిజామాబాద్ మార్చి 10: (విజయ క్రాంతి) ః తప్పుడు ప్రచారాలతో అక్రమంగా అడ్మిషన్లు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ప్రెసిడెన్సి విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలని %జుఊఏ్పు% నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఓమయ్య,ఏఐఎస్‌ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం అన్నారు. సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) (ఏఐటీయూసీ) సంఘాల అధ్వర్యంలో నిజామాబాద్ నగరం (వినాయక్ నగర్) లో గల ప్రెసిడెన్సీ (మెయిన్ బ్రాం ముందట) ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఓమయ్య,ఏఐఎస్‌ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. ప్రెసిడెన్సీ ఇంటర్నేషనల్ (ఆరావళి క్యాంపస్) పేరుతో విద్యాశాఖ నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తు అదేవిధంగా తప్పుడు ప్రచార లతో ఓడింగులు పెట్టి మరి ప్రచారం చేస్తు 50 శాతం ఫిజు ముందే వసూలు చేస్తన్నారన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసినా తరువాత జిల్లా కలెక్టర్ దృష్టికి పూర్తి సమాచారంతో అందజేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించిన తర్వాత కూడా ప్రెసిడెంట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకుండా ప్రెసిడెంట్ విద్య సంస్థల యజమాన్యానికి తోత్తులుగా వ్యవహాస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు రూరల్ ఎంఈఓ తో మాట్లాడితే మేము చెప్పినా మా మాట వినడం లేదని చెప్పడం చూస్తే వారి ధోరణి ఏంటో అర్థం అవుతుందన్నారు.

ఎంఈఓ ఈ విధంగా అనడం హాస్యాస్పదకారమ్తెనా విషయంగా అనిపిస్తుందన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఇన్సప్ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ ఖాన్, అలీ ,మరియు ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు సుభొద్, కుశాల్,దినేష్, నవీన్ కృష్ణ,కార్తీక్,వంశి, నాయకులు పాల్గొన్నారు.