calender_icon.png 10 March, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచలో అక్రమాల దందా?

10-03-2025 12:20:33 AM

పాలకవర్గం లేక కొరవడుతున్న పర్యవేక్షణ 

అధికారులపై అక్రమార్కుల ఒత్తిళ్లు 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9 (విజయ క్రాంతి): పారిశ్రామిక ప్రాంతంగా పేరు అందిన పాల్వంచ మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తి స్థాయిలో కొరబడిందని చెప్పక తప్పదు. అక్రమార్కులు అధికారులపై ఒత్తిళ్లకు గురిచేస్తూ వారి పబ్బాన్ని కడుపుకుంటున్నారు. దొడ్డి దారిన ఇంటి నెంబర్ పొందాలన్నా, అక్రమ షెడ్ లో నిర్మించాలన్న, అనుమతి లేని భవనాలు కోకోల్లలుగా  వెలుస్తున్న వాటినేద్రించడంలో అధికారుల విఫలమవుతున్నారు. అందుకు పాల్వంచ కిన్నెరసాని రోడ్డులో అసంపూర్తిగా ఉన్న ఇంటికి ఇంటి నెంబర్ పొందటం, పాత ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రధాన మురికి కాలువపై షెడ్డు నిర్మించడం, అనుమతి లేకుండా అనేక భవనాలు నిర్మించడం చక్కని తార్కానంగా నిలుస్తున్నాయి.

అక్రమార్కులకు రాజకీయ అండదండలు మెండుగా ఉండటంతో అధికారులు నియమ నిబంధనలు అమలు చేయలేకపోతున్నట్లు వాపోతున్నారు. పట్టణ పరిధిలోని కేఎస్పి రోడ్లో గల ఓ భవన నిర్మాణం పూర్తికాకుండానే ఇంటి నెంబర్ పొందటం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పిల్లలపై స్లాప్ వేసిన నిర్మాణానికి దర్జాగా ఇంటి నెంబర్ 8-1-192/1/A/1 అధికారులు జారీ చేశారు. వాస్తవంగా ఇంటి నెంబర్ జారీ చేయాలంటే గోడలు నిర్మించి, పై కప్పు వేసి ఉండాలి. అప్పుడే అధికారులు ఆ ఇంటికి నెంబర్ జారీ చేస్తుంటారు. కానీ అక్రమార్కులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇంటి నెంబర్ పొందినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. ఇంటి నెంబర్ పొంది దాని ద్వారా బదలాయింపు జరిగినట్టు తెలుస్తోంది.

అంటే అధికారులను తప్పుదోవ పట్టించి ఆస్తి బద్దలాయించేందుకే ఇంటి నెంబర్ పొందినట్టు తేటతెల్లమవుతుంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుజాతను వివరణ కోరగా నోటీసు జారీ చేసి ఇంటి నెంబర్ రద్దు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. బ్యాంకు నుంచి లోను తీసుకొని ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామంటూ వేడుకోవడంతో ఇంటి నెంబర్ జారీ చేయాల్సి వచ్చిందని, తప్పుదో పట్టించి ఆస్తిని బదిలాయిస్తారని తెలిసి ఉంటే నెంబర్ జారీ చేసే వారం కాదన్నారు.