calender_icon.png 25 November, 2024 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి స్థాయి క్రీడలు ప్రారంభించిన ఇల్లందు ఏరియా జి.యం

15-10-2024 01:58:43 PM

కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్  గేమ్స్ అసోసియేషన్, సింగరేణి ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో  స్థానిక వై.సి.ఓ.ఎ క్లబ్, 24 ఏరియా,  సింగరేణి స్కూల్ గ్రౌండ్ నందు కంపెనీ స్థాయి బాస్కెట్ బాల్, లాన్ టెన్నిస్ క్రీడా పోటీలను ఏరియా జి.యం.జాన్ ఆనంద్ మంగళవారం  ప్రారంభించారు. ఈ సందర్భముగా  ఆయన ఒలంపిక్ జెండాను ఎగరవేసి 6 రీజియన్ల నుండి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లోనే కాకుండా ఉద్యోగుల పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని వారికి మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు ఏ ఇతర కంపెనీలలో లేని విధంగా సింగరేణి సంస్థ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, కంపెనీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ తమ క్రీడలలో సత్తా చాటి కంపెనీ పేరు ప్రతిష్టలు నిలపాలని కొనియాడారు.

ఈ కంపెనీ స్థాయి పోటీలలో సింగరేణి వ్యాప్తంగా మొత్తం (6) రీజియన్ లెవల్ లో ఎంపిక అయిన క్రీడాకారులు పాల్గొనేందుకు వచ్చారన్నారు. ఈ క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులు కోల్ ఇండియా లెవెల్ లో జరిగే లాన్ టెన్నిస్ పోటీలకు పంపుతామని తెలిపారు. కోల్ ఇండియా లెవెల్ లో రాణించి సింగరేణి ప్రతిభ చాటాలని జీఎం కోరారు. ఈ కార్యక్రమంలో  అధికారుల సంఘం అధ్యక్షుడు ఎ.జి శివ ప్రసాద్, డిజిఎం పర్సనల్ జి.వి.మోహన్ రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు జే.వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్  అసిస్టెంట్ సుపెర్వైజర్  పర్స శ్రీనివాస్,  సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ సాయి స్వరూప్, అజయ్,  స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.