calender_icon.png 6 November, 2024 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా పేకాట

06-11-2024 02:42:30 AM

సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న పేకాట 

పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు

సంగారెడ్డి, నవంబర్ ౫ (విజయక్రాంతి): పచ్చని కాపురాలను పేకాట మూడు ముక్క లు చేస్తోంది. పేకాటకు బానిసైన వారు అన్నీ పోగొట్టుకొని రోడ్డున పడుతున్నారు. కూర్చు న్న చోటే డబ్బులు సంపా దించవ చ్చన్న అత్యాశతో కొంతమంది జేబు లు గుల్ల చేసుకుంటున్నారు. పేకాట ఆడేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. వందలు, వేలు, లక్షల రూపాయలు పెట్టి ఆడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పేకాట జోరుగా సాగుతుందని విశ్వసనీయ సమాచారం.  అయి నా పోలీసులు దాడులు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

సీసీఎస్ పోలీసులు దాడులు చేసే వరకు స్థానిక పోలీసు లకు సమాచారం ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పటాన్‌చెరు, సంగా రెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ సబ్ డివిజన్ పరిధిలో జూదం హవాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కాగా, స్థానిక పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్న నగదు రికార్డులకెక్కడం లేదనే విమర్శ లు వస్తున్నాయి. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు సంగారెడ్డి జిల్లాలో రూ.లక్షల్లో పేకాట సాగుతుంది.

కొందరు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి లక్ష్మి పూజ పేరుతో పేకాట నిర్వహిస్తారు. ఆటలో డబ్బులు కోల్పోతే అప్పులు చేసి మరీ ఆడేవారు ఉన్నారు. ఇటీవల  పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంద్రేశంలో పేకాటాడుతున్న ఆరుగురిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని రూ. 91,270 సీజ్ చేశారు. కాగా, స్థానిక పోలీసులకు ప్రతి నెలా మామూళ్లు ఇచ్చి దందా సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోలీసు నిఘా ఉన్న ప్రాంతాల్లో జూదం ఆడకుండా శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారని సమాచారం.

ఫాంహౌజ్‌ల లోనూ పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. పేకాట నిర్వాహకులు ప్రతిరోజు ఉదయమే ఆడేవారికి సమాచారం ఇస్తారని తెలిసింది. నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో వారు అక్కడికి చేరుకుంటారు.