calender_icon.png 20 January, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భగుడిలోకి వెళ్లేందుకుఇళయరాజా యత్నం

17-12-2024 12:38:41 AM

అడ్డుకున్న అర్చకులు, ఆలయ అధికారులు

చెన్నై, డిసెంబర్ 16: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపు త్తూరులోని ఆండాళ్ ఆలయాన్ని సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు సందర్శిం చారు. అమ్మవారిని దర్శించుకుంటూనే గుర్భగుడిలోకి వెళ్లేందుకు ఆయన యత్నించగా అర్చకులు, అధికారులు అడ్డుకున్నారు. గర్భగుడిలోకి సాధారణ పౌరులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. అయితే.. దీనిపై ఇప్పటివరకు దేవస్థాన కమిటీ అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.