calender_icon.png 23 March, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

22-03-2025 06:55:29 PM

లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం

ఐకేపీ యూనియన్

మంచిర్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఐకేపీ యూనియన్ జిల్లా అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్(IKP Union District President Dumpala Ranjith Kumar) హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు కుంటాల కుమార్ అధ్యక్షతన శనివారం చార్వక హాల్ లో జరిగిన ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా కమిటీ సమావేశం(IKP VOA Employees Association District Committee Meeting)లో  ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

విఓఏలకు ఇచ్చే కొద్దిపాటి వేతనం ఎటూ సరిపోవడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం విఓఏలకు రూ.20 వేల వేతనం ఇవ్వాలని, విఓఏలకు ప్రతినెలా రెగ్యులర్ గా వేతనాలు వ్యక్తిగత ఖాతాల ద్వారా ఇవ్వాలని, గ్రేడింగ్ కు సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని, పెండింగ్ ఇన్సెంటివ్ గ్రామ సంఘాలకు ఇవ్వాలని, అర్హులైన విఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐకేపీ యూనియన్ (సీఐటీయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంటాల కుమార్, దుర్గం రాములు మాట్లాడుతూ స్త్రీనిధి ఇన్సెంటివ్ 2 సంవత్సరాల నుంచి రావడం లేదని, పెండింగ్ లో ఉన్న స్త్రీ నిధి ఇన్సెంటివ్ వెంటనే గ్రామ సమైక్యలకు ఇవ్వాలని, అలాగే గ్రామ సంఘాలలో ల్యాప్ ట్యాప్ లు లేక ఆన్ లైన్ పనులకు ఫోన్లు సపోర్ట్ చేయక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి ల్యాప్ ట్యాప్, ట్యాబ్ లు ఇవ్వాలని, గ్రామ సంఘం పుస్తక నిర్వహణ కోసం ఎంపిక చేసిన విఓఏలకు అనేకరకాల పనులు చేయిస్తున్నారన్నారు. ఎస్ హెచ్ జి, ఏఓ అంకౌంటింగ్, ఎస్ఆర్ఎల్ఎం యాప్, లఘుపతి దీదీ లోకోస్ యాప్ లతో ఆన్ లైన్ పసులు ఎలాంటి సౌకర్యం లేకుండా చేయిస్తూ రోజు రోజుకి పని భారం పెరుగుతోందని, ఎంతో మంది విఓఏలు ప్రభుత్వం ఇస్తున్న అతి తక్కువ గౌరవ వేతనంతో కుటుంబాలు గడవక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాన్నారు. కనీస బీమా సౌకర్యం లేక విఓఏల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ నేపథ్యంలో విఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పొట్ట పోశం, జిల్లా కమిటీ సభ్యులు రజిత, మహేష్, తుకారాం, సమ్మన్న, మల్లేష్, శ్రీవేణి, సత్తక్క, వెంకటస్వామి,  తదితరులు పాల్గొన్నారు.