21-04-2025 05:09:17 PM
ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళ సమాఖ్య (ఐకేపీ)ల్లో పనిచేస్తున్న గ్రామైక్య సంఘాల వీవోఏల సమస్యలను పరిష్కరించాలని ఏఐసిటియు జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి డిమాండ్ చేశారు. కేసముద్రంలో సోమవారం జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామైక్య సంఘాల్లో మహిళలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీవోఏలకు పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా కేవలం నెలకు 5000 చెల్లిస్తున్నారని ఆరోపించారు. గ్రామైక్య సంఘాల్లో మహిళలను చైతన్యపరుస్తూ వారి ఆర్థిక లావాదేవీలు అన్నిటిని ఖాతాల్లో నమోదు చేస్తూ కష్టపడుతున్న సిఏలకు అతి తక్కువ వేతనం ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి జిల్లా వ్యాప్తంగా ఉన్న 667 మంది వివోఏలకు నెలకు 20వేల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.