calender_icon.png 5 January, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఆవిష్కరణల కేంద్రాలు ఐఐటీలు

04-01-2025 01:35:08 AM

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

సంగారెడ్డి, జనవరి 3 (విజయక్రాంతి): దేశ నిర్మాణం, కొత్త ఆవిష్కరణలకు ఐఐటీలు కేంద్రాలుగా మారుతున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ(హైదరాబాద్)లో ఏర్పాటు చేసిన ఆస్ట్రే  క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌కు భట్టి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

దేశంలోనే హైదరాబాద్ ఐఐటీ ఆవిష్కరణలకు వేదికగా మారిం  తెలిపారు. ఆస్ట్రేలియ క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణతో పాటు దేశానికి, ప్రపంచానికే కీలకంగా మారునున్నట్లు తెలిపారు.

సమావేశంలో ఐఐటీ హైదరా  డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్  బెంగళూర్ హిల్లరీ మెక్‌గేచీ, భారతదేశ హైకమిషనర్ ఆస్ట్రేలియా గోపాల్ బాగ్లే, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ దినేశ్ మ హుర్, సింగరేణి కాలరీస్ సీఎండీ బలరాం నాయక్, ఫ్రొఫెసర్ మోహన్ యెల్లిశెట్టి పాల్గొన్నారు.