calender_icon.png 20 November, 2024 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీ మద్రాసే టాప్

13-08-2024 12:22:39 AM

విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించిన కేంద్రం

ఇంజినీరింగ్, ఓవరాల్ క్యాటగిరీలో ఐఐటీ మద్రాస్

యూనివర్సిటీల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు టాప్

స్టేట్ పబ్లిక్ వర్సిటీల్లో ఉస్మానియాకు ఆరో ర్యాంకు

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ర్యాంకులను ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ర్యాంకులను విడుదల చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ౨౦౧౬ నుంచి ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నది. ఈ ఏడాది కొత్తగా ఓపెన్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, రాష్ట్రప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ యూనివర్సిటీ విభాగాలను చేర్చి ర్యాంకులు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి స్వావలంబన విభాగంలోనూ ర్యాంకులు ఇస్తామని ప్రకటించారు.

ఈ ఏడాది ర్యాంకుల్లో కూడా సాంకేతిక అంశాల విభాగంలో ఐఐటీలే ఆధిపత్యం వహించాయి. యూనివర్సిటీల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), జామియా మిలియా వర్సిటీలు టాప్‌లో నిలిచాయి. ఈ ఏడాది ర్యాంకుల కేటాయింపు మూల్యాంకనంలో కూడా మార్పులు చేశారు. వైద్య విద్యాసంస్థల్లో అధ్యాపకుడు విద్యార్థి నిష్పత్తిని 1:15 నుంచి 1:10కి తగ్గించారు. రాష్ట్రాల యూనివర్సిటీల్లో 1:15 నుంచి 1:20కి పెంచారు. ర్యాంకుల కేటాయింపు కోసం ఐదు అంశాలను లెక్కలోకి తీసుకొన్నారు.

1.బోధన, అభ్యసన, వనరులు. 2. పరిశోధన, ప్రొఫెషనల్ ప్రాక్టీస్. 3. చదువు పూర్తిచేసుకొని బయటకొస్తున్న మానవ వనరులు. 4. లక్ష్యానికి చేరువ. 5. అవగాహన అంశాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల కోసం ఈ ఏడాది 10,885 విద్యా సంస్థలు పోటీలో నిలిచాయి. గత ఏడాది ఈ సంఖ్య 5,543 మాత్రమే. మొత్తం 16 విభాగాల్లో ఎంట్రీలు వచ్చాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఓపెన్ యూనివర్సిటీ క్యాటగిరీలో ఇంధిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఆరోస్థానం, ఏపీలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో స్థానం దక్కాయి. ఆవిష్కరణ విభాగంలో ఐఐటీ హైదరాబాద్‌కు మూడోస్థానం దక్కింది.

ఓవరాల్ క్యాటగిరీలో 

టాప్ 10 విద్యా సంస్థలు

విద్యా సంస్థ ర్యాంకు

ఐఐటీ మద్రాస్ 1

ఐఐఎస్‌సీ 2

ఐఐటీ బాంబే 3

ఐఐటీ ఢిల్లీ 4

ఐఐటీ కాన్పూర్ 5

ఐఐటీ ఖరగ్‌పూర్ 6

ఎయిమ్స్ ఢిల్లీ 7

ఐఐటీ రూర్కీ 8

ఐఐటీ గువాహటి 9

జేఎన్‌యూ 10