లక్నో, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ‘ఐఐటీ బాబా’ పర్యటన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. హర్యానాకు చెందిన అభేయ్‌సింగ్ ‘ఐఐటీ ముంబై’లో ఏరోస్పేస్ ఇంజినీ రింగ్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే కార్పొరేట్ ఉద్యోగం సాధించాడు. కొంతకాలం తర్వాత ఆధ్యాత్మికం వైపు ఆకర్షితులయ్యారు.
క్రమంగా ‘ఐఐటీ బాబా’గా ప్రసిద్ధి చెందారు. తాజాగా ఆయన ప్రయాగ్‌రాజ్‌కు విచ్చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించి మీడియాతో మాట్లాడారు. తాను సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తున్నానని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ప్రత్యేక ఆకర్షణగా హర్షా రిచారియా..
మహాకుంభమేళాలో ఉత్తరాఖండ్‌కు చెం దిన హర్షా రిచారియా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణ, నుదుట తిలకం, మెడలో రుద్రక్షమాలతో త్రి వేణి సంగమానికి విచ్చేయగా, ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొందరు ఆమెను మహి ళా సాధ్వి అంటుండగా, ఆమె మాత్రం తాను సాధ్వి కాదని, కేవలం భక్తురాలిని మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. తాను నిరంజనీ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామీజీ శిష్యురాలినని వెల్లడించారు.