calender_icon.png 10 March, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఐసో ఎడ్యుకేషన్’ కళాశాలగా ఐఐఎంసీ

05-03-2025 01:26:00 AM

ఖైరతాబాద్, మార్చి 3: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కళాశాల (ఐఐఎంసీ న్యూస్) ఐసీఓ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ సాధించి 2024--25 విద్యా సంవత్సరంలో అకడమిక్ ఎక్స్‌లెన్స్‌లో కొత్త యుగంలోకి అడుగు పెట్టింది.ఈ కాలేజీ 1973 నుంచి వాణిజ్య శాస్త్రం, మేనేజ్మెంట్, సైన్స్ రంగాల్లో విద్యా వైభవానికి ప్రసిద్ధి చెందింది.

1973లో 100 మంది విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు 1,700 మంది విద్యార్థులకు పెరిగింది. 2023లో న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు పొందింది. ఇప్పుడు ఐసో ఎడ్యుకేషన్ సర్టిఫైడ్ కళాశాలగా కూడా గుర్తింపు పొందింది. బీఎస్సీ ఐసీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే 2024--25 విద్యా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల కాలానికి కళాశాలకు ‘ఐసీఓ 21001:2018 ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్’ ప్రధాన లేఖను అందించింది.

ఇంతటి విజయాన్ని సాధించినందుకు కళాశాల చైర్మన్ వంగపల్లి విశ్వనాథం, కళాశాల సెక్రటరీ చల్లా ప్రసన్నకుమార్, యాజమాన్య సభ్యులు, ప్రిన్సిపల్ కూర రఘువీర్, అధ్యాపకుల ఆనందం వ్యక్తం చేశారు.