22-02-2025 01:20:16 AM
సిద్దిపేట, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కడుపెదరికన్ని అధిగమించి ఉన్నత విద్యా చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో శుక్రవారం వరం జరిగింది. గ్రామానికి చెందిన రామగాళ్ల శంకరయ్య కుమార్తె రమ్య (25) బాసర త్రిబుల్ ఐటిలో ఫైనల్ ఇయర్ చుడుతుంది. కొన్ని రోజులుగా జాండిస్ వ్యాధితో బాధపడుతుంది. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచింది. చదువులో క్లెవర్ గా ఉన్న రమ్య అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.