calender_icon.png 22 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటల్ చైన్‌లలో మేటి సంస్థగా ఐహెచ్‌ఎమ్

13-12-2024 01:05:35 AM

  • సంస్థ హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ కే ఠాకూర్
  • విద్యార్థులతో కలిసి ఘనంగా క్రిస్మస్ గాలా లంచ్

  • హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడంతోపాటు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రఖ్యాత విద్యాసంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్(ఐహెచ్‌ఎమ్) హైదరాబాద్ గురువారం డీడీ కాలనీలోని క్యాం పస్‌లో ఘనంగా క్రిస్మస్ గాలా లంచ్‌ను నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఐహెచ్‌ఎమ్ ప్రిన్సిపాల్ సంజయ్ కే ఠాకూర్ హాజరయ్యారు.

  • ఫైవ్ స్టార్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌లు, ప్రసిద్ధ స్టాండ్ అలోన్ రెస్టారెంట్ల ప్రతినిధులు, హాస్పిటాలిటీ రంగ ప్రముఖులు, శిక్షణ మేనేజర్లు తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ దేశంలో ప్రముఖ హోటల్ చైన్‌లచే అత్యుత్తమ సంస్థలలో ఒకటిగా గౌరవం పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐహెచ్‌ఎమ్ విద్యార్థులు తమ అద్భుతమైన వంటక కళను ప్రదర్శిస్తూ రోస్ట్ టర్కీ, స్టోలెన్, హమ్మస్ మెజ్జె, కొక్ ఆ విన్ వంటి ప్రత్యేక వంటకాలను రూపొందించారు.

  • ఈ ఉత్సవానికి శ్రావ్యమైన క్రిస్మస్ క్యారోల్స్‌ను ఐహెచ్‌ఎమ్ ఇన్ హౌస్ బ్యాండ్ ఫ్లూట్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. హాస్పిటాలిటీ విద్యారం గంలో అనిర్వచనీయ కీర్తిని సంపాదించిన ఐహెచ్‌ఎమ్ హైదరాబాద్..  విద్యార్థులను అత్యున్నత నైపుణ్యాలు, జ్ఞానం తో తీర్చిదిద్దుతుందని ప్రిన్సిపాల్ సంజయ్ ఠాకూర్ తెలిపారు.