హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో తమకు కనీస సౌక ర్యాలు కల్పించాలంటూ తెలంగాణ ఆడబిడ్డలు, గురుకుల విద్యార్థినుల వీధుల్లో పోరాటం చేస్తుంటే, జూ పార్కు నిర్మించాలని సీఎం రేవంత్ చేసే ప్రయత్నం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. విద్యార్థిను ల సమస్యల పరిష్కారం కంటే జూ పార్కు నిర్మాణానికే సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని, ముందుగా ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇవ్వా లని శనివారం ఎక్స్ వేదికగా సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలో విద్యా ర్థినులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఎందుకు శిక్షిస్తున్నార ని ప్రశ్నించారు. పాలమాకుల స్కూల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ మంత్రు లు హరీశ్‌రావు, సబితారెడ్డి, యువనేత కార్తీక్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.