బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీసీ అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ ‘తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికలు బీసీల పాత్ర’ అనే అంశంపై బీసీ మేధావులు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలతో లక్డీకాపూల్‌లోని అశోక హోటల్లో శనివారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించగా.. బీసీ కమిషన్ జా మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, విద్యా కమిషన్ సభ్యులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ హాజరయ్యారు.
జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వకుంటే ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుందారపు గణేషాచారి, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.