calender_icon.png 20 September, 2024 | 8:19 PM

ఆ కామెంట్స్ పట్టించుకోకండి!

17-09-2024 12:00:00 AM

ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి కామెంట్స్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. బాగా లావుగా ఉన్నావ్, నల్లగా ఉన్నావ్, పొట్టిగా ఉన్నావ్, బక్కగా ఉన్నావ్ అంటూ పక్కవారిపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. పైగా వారికి ఎక్కడలేని సలహాలిస్తూ ఉపకారం చేస్తున్నట్లు భావిస్తారు కూడా. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే అది మానసికంగా కుంగదీస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే బాడీ పాజిటివిటీని పెంచుకోవాలి. 

మన శరీరం.. మన లుక్.. మనం ఎలాగైనా ఉండొచ్చు. దానిపై ఇతరులు కామెంట్ చేస్తే బాధపడాల్సిన పని లేదు. మనల్ని మనం ఎలా ఉన్నా స్వీకరిండాన్నే బాడీ పాజిటివిటీ అంటారు. కొందరికి ఇంట్లోనే విమర్శలు ఎదురౌతాయి. వారికి బయటి వారికి చెప్పినట్లు సమాధానం చెప్పలేకపోతే మీ గురించి ఆందోళన పడాల్సిన అవసరం వారికి లేదు అనే విషయాన్ని చెప్పండి. లేదు.. వారు అర్థం చేసుకోగల వ్యక్తి అయితే.. బాడీ షేమింగ్ గురించి అవగాహన కల్పించండి. అది అవతలివారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరించండి.

అలాగే మీ జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని అందరికీ చెప్పాలని, అందరూ స్పందించాలని కోరుకోవడం మానేయండి. ఇలా చేస్తే మన కంట్రోల్‌ని వారి చేతిలో పెట్టినట్లే. ఎక్కువగా బాడీ షేమింగ్ ఎదుర్కొనే మరో ప్లేస్ ఇంటర్నెట్. మనం ఏవైనా ఫోటోలు షేర్ చేస్తే.. వాటిపై భయంకరమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. అవతలి వ్యక్తి గురించి ఎలాంటి విషయాలు తెలియపోయినా నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు.

అయితే.. వారి కామెంట్స్‌కి స్పందించకపోవడమే ఉత్తమమైన మార్గం. లేదు అంటే.. వారికి గట్టి కౌంటర్ ఇచ్చేలా.. వారి పేరు ట్యాగ్ చేసి మరీ.. మరోసారి అలాంటి కామెంట్ చేయకుండా రిఫ్లు ఇవ్వాలి. లేదంటే పూర్తిగా ఇగ్నోర్ చేయ్యాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతారు.