calender_icon.png 7 November, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యమత ప్రచారం ఉపేక్షించం

07-11-2024 01:48:37 AM

  1. అన్యమత ఉద్యోగుల కొనసాగింపుపై బోర్డులో చర్చిస్తాం
  2. టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి బుధవారం కొలువు దీరింది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించడంతోపాటు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పాలకమండలి ముందు చాలా సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

రాబోయే పాలకమండలి సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడేలా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. అన్యమత ఉద్యోగుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు త్వరిత గతిన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధుల దారి మల్లింపుపై విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత ట్రస్టు కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.