calender_icon.png 17 March, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 118పై అవగాహన లేని అజ్ఞాని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

17-03-2025 01:15:58 AM

ఎల్బీనగర్, మార్చి 16 : జీవో 118 పేరిట ఇచ్చిన కన్వీనియన్స్ డీడ్  విషయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి .. కనీస అవగాహన లేని అజ్ఞాని అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జీవో 118పై ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుల తప్పుడు ఆరోపణలు నేపథ్యంలో వనస్థలిపురంలోని కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్ గౌడ్, సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు కుట్ల నర్సింహయాదవ్ , చెన్నగొని రవీందర్ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, కేవీయన్ రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కన్వీని యన్స్ డీడ్ తో తమ భవనాలకు విలువ లేకుండా పోయిందని, మాకు కన్వీనియన్స్ డీడ్ లు వద్దు అని కాలనీ వాసులందరూ ముక్తకంఠంతో కోరుతుంటే.. ఎమ్మెల్యే మాత్రం వాటినే ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.

ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తానని లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన సుధీర్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీవు హామీ ఇచ్చి ఆరేండ్లు గడుస్తున్నా అవే అబద్దపు మాటలతో మో సం చేయడం మానుకోవాలని సూచించారు. శాశ్వత పరిష్కారం చూపాలని మధు యాష్కి గౌడ్ ను బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. 

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ పార్కులన్నీ తెరుచుకుంటున్న విషయం కనిపించక పోతే ఎమ్మెల్యే కళ్ళజోడు పెట్టుకోనైనా చూడాలని.. లేకపోతే మేమైనా తీసుకెళ్లి చూపిస్తామని తెలిపారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పసుపులేటి సాయి నికేష్, వింజమూరు శ్రావణ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సూర్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ , రమేశ్ నాయక్ ఇతరులు ఉన్నారు.