పరిగి,(విజయక్రాంతి): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) ప్రెస్ మీట్ పెట్టడంపై ఐజీ సత్య నారాయణ(IG Satyanarayana) అభ్యంతరం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ... లగచర్ల ఘటన(Lagacharla Incident)లో నరేందర్ రెడ్డి కండీషన్ బెయిల్ పై ఉన్నారని, విచారణను ప్రభావితం చేసేలా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని ఐడీ పేర్కొన్నారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు సిఫారసు చేస్తామన్నారు.
లగచర్ల ఘటనకు పోలీసుల నిఘా వైఫల్యం కారణమనటం సరికాదని ఐజీ మండిపడ్డారు. లగచర్లలో 230 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prateek Jain)పై దాడి చేసినందుకే నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. లగచర్లలో ఎవరిపైనా ఎవరిపైనా పోలీసులు లాఠీచార్జి చేయాలని, అనుమానితులను మూడు విడతల్లో అదుపులోకి తీసుకున్నామని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి సంబంధంలేని వారిని వదిలేశామని, ఏ ప్రభుత్వం రైతులకు బేడీలు వేయమని చెప్పాదన్నారు. పట్నం నరేందర్ రెడ్డి, సురేశ్ విచారణలో సహకరించలేదని ఐజీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.