28-03-2025 12:00:00 AM
కోదాడ మార్చి 27: ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతికలుగా నిలుస్తా యని స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం.డి జబ్బర్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని 26 వార్డు రోశమ్మ వీధిలో శెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐక్యతకు సోదర భావానికి రవికుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. ఉపవాస దీక్షకుల దీవెనలు ప్రజలందరికీ ఉంటాయన్నారు.
దాన ధర్మాలకు రంజాన్ మాసం ప్రతీక అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందు నిర్వాహకులు శెట్టి రవికుమార్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు అంజయ్య నాయకులు పందితిరపయ్య, దొంగరి శీను పాల్గొన్నారు.