calender_icon.png 1 April, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్

26-03-2025 01:36:18 AM

సూర్యాపేట, మార్చి25 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు.

మంగళవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసి  ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు.  ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.