23-03-2025 08:54:27 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు(Iftar Dinner) ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం క్లబ్ లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందుని ఇచ్చారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్(District Collector Jitesh V Patil), కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, కోనేరు సత్యనారాయణ, నాగేంద్ర త్రివేది, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా నాయకులు పెదబాబు, తదితరులు ఇఫ్తార్ దావత్ లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
సుమారు 2500 మందికి పైగా ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస ఉపవాసాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ(Ramadan Festival) వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మైనారిటీ జిల్లా సెక్రటరీ,రైల్వే బోర్డ్ సభ్యులు,మాజీ కౌన్సిలర్స్,ఆర్టీఏ, టెలికం బోర్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.