24-03-2025 04:22:02 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల హిందూ ముస్లింల మతసామరస్యతకు ప్రతీకగా ఇఫ్తార్ విందులు దోహదపడతాయని మండల బీఆర్ఎస్ నాయకులు నల్లపాటి నాగేశ్వరావు అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలో గ్రామానికి చెందిన నల్లపాటి నాగరాజు ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, ఎంతో నిష్టతో నెలంతా దీక్షలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల పిఎస్ఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, నల్లపాటి పురుషోత్తం, శెట్టి గిరి, హుస్సేన్ శంకర్ నాగరాజు, మైనార్టీ నాయకులు, సుతారి మేస్త్రి సైదా భాష, జానీ మియా, ముజీబ్, జానీ తదితరులు పాల్గొన్నారు.