27-03-2025 08:38:43 PM
సదాశివపేట: సదాశివపేట పట్టణంలోని ముర్షద్ దర్గా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గురువారం సదాశివపేట పట్టణంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రాంరెడ్డి, సదాశివపేట పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, సిద్ధన్న, మాజీ కౌన్సిలర్ లు ప్రసన్న శంకర్ గౌడ్, నాగరాజుగౌడ్, గుండు రవి, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పట్నం సుభాష్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ సడకుల కుమార్, వైస్ చైర్మన్ కంది కృష్ణ, కాంగ్రెస్ నాయకులు వీరన్న స్వామి, రఘు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.