23-03-2025 12:47:24 AM
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): దావత్ ఏ ఇఫ్తార్‌ను రాష్ట్ర వ్యాప్త ంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని, ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యా ల కల్పనలో అధికారులు రాజీప డొ ద్దని భట్టి సూచించారు.
శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లపై మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీతో కలిసి సంబంధిత అధికారులతో భట్టివిక్రమార్క సమీక్షించారు. ఏర్పాట్లలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొదన్నారు.