21-03-2025 01:25:18 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కుత్బుల్లాపూర్, మార్చ్ 20(విజయక్రాంతి): ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 - సూరారం డివిజన్ షాపూర్ నగర్ ప్రధాన రహదారిలోని ఎం.జె గార్డెన్స్ నందు బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన దావత్-ఇ-ఇఫ్తార్ కార్యక్రమానికి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్యఅతిథిలుగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇతరులు ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదరభావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడుతాయని అన్నారు.
ముస్లిం సోదరులు నెలరోజులపాటు అత్యంత కఠిన నియమాలతో ఆ అల్లాను ప్రార్ధిస్తారని, అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూర తినిపిస్తూ ఉపవాసాన్ని విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, మతపెద్దలు, మైనార్టీ నాయకులు, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.