29-03-2025 01:01:09 AM
మతసామరస్యానికి ప్రతీక ఘనంగా దావత్ ఏ ఇఫ్తార్
ఐకమత్యం సోదర భావం విలసిల్లేల
పెద్ద కోడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో సామూహిక నమాజ్ కు ముందు ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలతో దీక్ష విరమింప చేశారు అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘంలో రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని అన్ని మతాలు చెప్పేది ఒకటే అని సోదర భావం విలసిల్లేలా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లప్ప పటేల్, సాయి రెడ్డి, మోహన్, శామప్ప పటేల్, బసవరాజ్ దేశాయ్ డాక్టర్ సంజీవ్ సంతోష్ దేశాయ్ ,మారుతి, మైనార్టీ నాయకులు అహ్మద్, రషీద్, మొహిదిన్ పటేల్, ఫిరోజ్, ఇస్మాయిల్ పటేల్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు