calender_icon.png 28 March, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముజీబ్ ఆధ్వర్యంలో నాంపల్లిలో ఇఫ్తార్ విందు

14-03-2025 12:00:00 AM

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి, అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎం హుస్సాని (ముజీబ్) ఆధ్వర్యంలో గురువారం నాంపల్లిలోని గృహకల్ప కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫహీముద్దీన్ ఖురేషి, మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇఫ్తార్‌లో సుమారు 2 వేల మంది పాల్గొన్నారు. వీరికి ఫలహారాలతో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర సంఘ నాయకులు, మహిళ ఉద్యోగులు, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు, ముజీబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.