calender_icon.png 1 April, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొల్లారంలో ఇఫ్తార్ విందు

29-03-2025 11:43:59 PM

పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్...

పటాన్ చెరు: బొల్లారం మున్సిపాలిటీలోని జామా మసీదులో కాంగ్రెస్ నాయకుడు బషీర్ శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లింలతో ఉపవాస దీక్షను విరమింపజేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... రంజాన్ మాసం సహనం, శాంతి, సోదర భావానికి ప్రతీక అన్నారు. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షల స్ఫూర్తి మనందరికీ ఆదర్శ నీయమని, ఈ పవిత్ర మాసంలో అందరికీ శాంతి, సంతోషం చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా, తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.