calender_icon.png 4 April, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

28-03-2025 12:06:11 AM

ఖమ్మం, మార్చి 27 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం టీఎన్జీవోస్ భవన్‌లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముజామిల్‌ఖాన్ హాజరయ్యారు. రంజాన్  మాసం ఆధ్యాత్మిక భక్తికి, స్వీయ క్రమశిక్షణకు ఉత్తమ సమయంగా భావిస్తారని, సమాజంలో కృతజ్ఞత, ఐక్యతకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. ఖమ్మం జిల్లా జేఏసీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు పెంపొందించే విధంగా కృషి చేస్తున్నందుకు అభినందించారు. 

కార్యక్రమంలో టీజీఈజేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, కో చైర్మన్ యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, టీజీఓస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, లెక్చరర్స్ అసోసియేషన్ సంఘం కృష్ణార్జునరావ్, సురేష్, వాసిరెడ్డి శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం బిక్కు, కోడి లింగయ్య, డ్రైవర్ల సంఘం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.