29-03-2025 11:42:13 PM
పాల్గొన్న మాజీ మంత్రి రామన్న...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): రంజాన్ పండగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. రంజాన్ పండగ సందర్భంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో చేపట్టిన ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందును అరగించారు. అలాగే వివిధ రంగాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారితో పాటు ముస్లిం మత పెద్దలను మాజీ మంత్రి జోగు రామన్న శాలువాతో ఘనంగా సత్కరించారు.