calender_icon.png 3 April, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్ విందు..

27-03-2025 11:14:45 PM

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..

సంగారెడ్డి (విజయక్రాంతి): ముస్లింలా పవిత్ర మాసం రంజాన్, రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో, నిష్టగా ఉపవాస దీక్ష చేస్తారని, ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన పవిత్ర రంజాన్ మాసంలో రోజువారీ ఉపవాసాన్ని ముగించడానికి, సూర్యాస్తమయం తర్వాత, మగ్రిబ్ ప్రార్థన అనంతరం తీసుకునే భోజనమే ఇఫ్తార్ అని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గురువారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. 

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని  జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా పోలీసులకు ‘దావత్-ఇ-ఇఫ్తార్’ను ఏర్పాటు చశారు .  ఈ విందులో జిల్లా పోలీసు అధికారులతో పాటు ముస్లిం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని, ఉపవాస దీక్ష ను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  అదనపు.ఎస్పీ ఎ.సంజీవరావ్, సీఐ  నయీమోద్దీన్ ,  ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఆర్.ఐ. రామ రావ్, ముస్లిం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.