23-03-2025 10:39:21 PM
జహీరాబాద్: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉంటున్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే మాణిక్ రావు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొని సోదర భావాన్ని పెంపొందించే లౌకిక విలువలు కాపాడాలని కోరారు. ముస్లిం సోదరులు నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండి అల్లాను ప్రార్థిస్తారని తెలిపారు. అల్లా దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరారు.
ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి గుండప్ప, రామకృష్ణారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పెంట రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు అల్లాడి నర్సింలు తంజీం, టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు మోహియోద్దీన్, మాజీ రైల్వే బోర్డు నెంబర్ షేక్ ఫరీద్, నాయకులు సంజీవరెడ్డి, వెంకటేశం, నర్సింలు, మచ్చేందర్, బండి మోహన్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.