calender_icon.png 16 April, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ కో ఆప్షన్ సభ్యుని ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

28-03-2025 11:06:05 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని సారంగపెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో మాజీ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి నసీరుద్దీన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు  ఏర్పాటు చేశారు. శుక్రవారం గ్రామంలోని ఆయన నివాసంలో ముస్లిం సోదరులకు పండ్లు అందచేసి ఉపవాస దీక్ష విరమింపజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. అనంతరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.